750,000 నార్కోటిక్ మాత్రల స్మగ్లింగ్‌ను అడ్డుకున్న కస్టమ్స్ అథారిటీ
- October 08, 2022
రియాద్: అల్-హదిత పోర్ట్, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 756,212 నార్కోటిక్ మాత్రల తరలింపు ప్రయాత్నాలను అడ్డుకున్నట్లు జకాత్, పన్ను,కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. రాజ్యానికి వచ్చిన అనేక షిప్‌మెంట్‌లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. ఆయా సరుకుల్లో దాచి తరలిస్తున్న మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ వివరించింది. తొలుత కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చిన "ఫర్నిచర్" షిప్ మెంట్లలో దాచిన 171,792 మాత్రలను గుర్తించామని, ఆ తర్వాత 60,500 మాత్రలను అక్రమంగా తరలించేందుకు చేసిన మరో ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నట్లు ZATCA వెల్లడించింది. అల్-హదితా పోర్ట్ ద్వారా వస్తున్న ట్రక్కుల రవాణాలో వివిధ ట్రక్కుల విభాగాల్లో దాచిన 247,670 మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దీనితోపాటు 276,250 నార్కోటిక్ మాత్రలను అక్రమంగా తరలించే మరో ప్రయత్నాన్ని అడ్డుకున్నామని తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ZATCA వెల్లడించింది. ఈ ఘటనలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్







