రిఫా సెంట్రల్ మార్కెట్ తాత్కలికంగా తరలింపు

- October 10, 2022 , by Maagulf
రిఫా సెంట్రల్ మార్కెట్ తాత్కలికంగా తరలింపు

బహ్రెయిన్: రిఫా సెంట్రల్ మార్కెట్ పునరుద్ధరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభావితమైన వ్యాపారులను తాత్కాలిక మార్కెట్ స్థలానికి అధికారులు తరలించారు. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తాత్కాలిక మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఎయిర్ కండిషనింగ్, భద్రతా సౌకర్యాలు కల్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 40 కూరగాయల దుకాణాలు, 12 చేపల దుకాణాలు, ఏడు మాంసం దుకాణాలు, రెండు చికెన్ స్టాల్స్ ఉన్న ప్రస్తుత రిఫా మార్కెట్ ను 10 నెలల్లో పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిఫా సెంట్రల్ మార్కెట్ పునరుద్ధరణ కోసం రెండు బిడ్‌లను మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్వీకరించింది. సరబ్ కాంట్రాక్టింగ్ కో ప్రాజెక్ట్ కోసం BHD 749,050.000, ఇంటర్ లాక్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ BHD 921,516.540 కోట్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com