హయ్య కార్డ్ హోల్డర్లకు త్వరలో ఎంట్రీ పర్మిట్లు: ఖతార్

- October 10, 2022 , by Maagulf
హయ్య కార్డ్ హోల్డర్లకు త్వరలో ఎంట్రీ పర్మిట్లు: ఖతార్

దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి టికెట్లను బుక్ చేసుకున్న, హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులకు ప్రవేశ అనుమతిని వారి ఇమెయిలకు పంపనున్నట్లు డెలివరీ & లెగసీ కోసం సుప్రీం కమిటీలో హయ్యా ప్లాట్‌ఫారమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయీద్ అల్-కువారి అల్-కాస్ తెలిపారు. నవంబర్ ప్రారంభం నుండి హయ్యా కార్డ్ హోల్డర్లందరికీ ఎంట్రీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. అలీ బిన్ హమద్ అల్ అత్తియా అరేనా (ABHA అరేనా), దోహా ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్ (DECC)లో హయ్యా కార్డ్ కోసం రెండు కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. DECC హయ్య కార్డ్ సెంటర్ 80 స్టాల్స్‌తో పెద్ద సెంటర్‌గా ఉంటుందని తెలిపారు.  హయ్యా కార్డ్‌కి సంబంధించిన అన్ని సందేహాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. హయ్యా కార్డ్ డిజిటల్ వెర్షన్ సరిపోతుందని, బుక్ చేసిన మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని సేవలను ప్రత్యేక కేంద్రాలు అందజేస్తాయని అల్-కువారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com