మానసిక సమస్యలను తేలికగా తీసుకోవద్దు.. ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపు

- October 10, 2022 , by Maagulf
మానసిక సమస్యలను తేలికగా తీసుకోవద్దు.. ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపు

మస్కట్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మానసిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు మానసిక వైద్యుడిని సంప్రదించడానికి సిగ్గుపడవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) కోరింది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ద్వారా ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2022లో 'అందరికీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత' థీమ్ తో నిర్వహిస్తున్నారు. 2019లో ఎనిమిది మంది వ్యక్తులలో ఒకరికి మానసిక రుగ్మత ఉండగా.. నేడు ఆందోళన, డిప్రెషన్ అనేవి అత్యంత సాధారణ మానసిక రుగ్మతలుగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. COVID-19 మహమ్మారి కారణంగా 2020లో చాలా మంది వ్యక్తులు ఆందోళన, డిప్రెషన్ డిజార్డర్‌లనతో ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ఈ కారణంగానే కేవలం ఒక సంవత్సరంలోనే మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడే సంఖ్య 26 శాతం నుంచి 28 శాతం పెరిగిందని WHO తెలిపింది. దురదృష్టవశాత్తూ కొందరు మానసిక అనారోగ్య వ్యక్తిని అసూయ లేదా భ్రమలు ఉన్న వ్యక్తిగా కూడా పరిగణిస్తారని ఒమన్ అల్జీమర్స్ సొసైటీ చైర్మన్, సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని బిహేవియరల్ మెడిసిన్ విభాగంలో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ హమద్ అల్ సినావి తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com