సౌదీ.. స్కూల్ బస్సులో బాలుడి మృతిపై విద్యాశాఖ సీరియస్

- October 11, 2022 , by Maagulf
సౌదీ.. స్కూల్ బస్సులో బాలుడి మృతిపై విద్యాశాఖ సీరియస్

మక్కా: తూర్పు సౌదీ అరేబియాలోని ఖతీఫ్‌లోని హలత్ మహిష్ పట్టణంలో ఆదివారం పాఠశాల బస్సులో 5 ఏళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో విషాద వాతారణం నెలకొన్నది. ఆదివారం అల్-నఖీల్ కిండర్ గార్టెన్‌కు వెళ్లాల్సిన బస్సులో హసన్ హషీమ్ అల్-షోలా అనే బాలుడు మరణించిన ఘటనపై విచారణ జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ‘‘స్కూల్ నుంచి ఉదయం 11:20 గంటలకు తన కొడుకు ఆ రోజు పాఠశాలకు ఎందుకు రాలేదని ఫోన్ వచ్చింది. నేను షాకయ్యాను. ఉదయం తామే స్వయంగా తమ కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించాం. అనంతరం స్కూల్ బస్సులో హసన్ కదలకుండా పడి ఉన్నాడని తెలిపారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసకుపోవాలని సూచించాం. అప్పటికే తమ కుమారుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.’’ అని హసన్ తండ్రి హషీమ్ అల్-షోలా వాపోయాడు. తరగతులు ప్రారంభమైన వెంటనే స్కూల్ యాజమాన్యం మమ్మల్ని సంప్రదించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నారు. మరోవైపు తూర్పు ప్రావిన్స్‌లోని విద్యా శాఖ హసన్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వాహనంలో విద్యార్థులు ఎవరూ లేరని నిర్ధారించుకోవడంలో విఫలమయ్యాడని స్పష్టంగా తెలుస్తుందని డిపార్ట్‌మెంట్ ప్రతినిధి సయీద్ అల్-బహెస్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com