క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం
- October 11, 2022
            కువైట్: కువైట్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన క్రూజ్ బోట్‌ను కోస్ట్ గార్డ్ అడ్డగించింది. అనంతరం చేపట్టిన తనిఖీల్లో బోటులో దాచిన 90 కిలోల మత్తుపదార్థాన్ని గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి సరుకు రవాణా యజమాని సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నభద్రతా బృందాలను ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అభినందించారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్, పోర్ట్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ మన్సూర్ అల్-అవాడి, కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ అల్-మౌన్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







