గాయపడిన కార్పెంటర్ కు Dh350,000 పరిహారం

- October 12, 2022 , by Maagulf
గాయపడిన కార్పెంటర్ కు Dh350,000 పరిహారం

యూఏఈ: ఎలక్ట్రిక్ రంపంతో పనిచేసే సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆసియాకు చెందిన ఓ కార్పెంటర్ కు Dh350,000 పరిహారం చెల్లించాలన్న అబుధాబి సివిల్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది. ఆసియా కార్మికుడిని నియమించిన వడ్రంగి కంపెనీని బాధితుడికి పరిహారం చెల్లించమని ఆదేశించింది. కంపెనీ నిర్లక్ష్యం, భద్రతా నియమాలను ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విద్యుత్ రంపాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఏర్పడ్డ గాయాల కారణంగా తనకు శాశ్వత వైకల్యం ఏర్పడిందని, దీంతో పని చేయలేకపోవడం వల్ల మానసికంగా, భౌతికంగా నష్టపోయానని.. పరిహారంగా తనకు 2 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికుడు కంపెనీపై దావా వేశాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు నేరం రుజువైన తర్వాత క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కంపెనీకి గతంలో 7,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి, నష్టపరిహారం కోసం తన యజమానిపై సివిల్ దావా వేయాలని కార్మికుడికి సూచించారు. అనంతరం సివిల్ కేసును విచారించిన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నష్టపరిహారంగా కార్మికుడికి Dh350,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పును సమర్థించింది. దాంతోపాటు కార్మికునికి చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తన తీర్పులో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com