వెక్టర్ వ్యాధులపై అక్టోబర్ 16 నుండి జాతీయ సర్వే
- October 12, 2022
మస్కట్: వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల కోసం సమగ్ర జాతీయ సర్వే అక్టోబర్ 16 నుండి వివిధ గవర్నరేట్లలో ప్రారంభమవుతుందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాధులతో సంబంధం ఉన్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి వ్యాధి వాహకాలు, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలపై ఈ సర్వేలో భాగంగా దృష్టి సారించనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడు నెలల సర్వేలో అన్ని గవర్నరేట్లు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే, కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతాలను కవర్ చేస్తుందని పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాల ద్వారా..గవర్నర్ కార్యాలయాల ద్వారా ఒక ప్రాంతంలో సర్వే తేదీ నివాసితులకు ముందుగానే తెలియజేయబడుతుందని తెలిపింది. జాతీయ ప్రాజెక్టును నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బృందాల పనిని సులభతరం చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మలేరియా, డెంగ్యూ జ్వరం, ఎల్లో ఫీవర్ వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు.. అన్ని అంటువ్యాధులలో 17 శాతానికి పైగా ఉన్నాయి. వీటివల్ల ఏటా 700,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇవి పరాన్నజీవులు, బ్యాక్టీరియా లేదా వైరస్ల వల్ల వేగంగా సంక్రమిస్తాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







