ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలి: బహ్రెయిన్‌

- October 12, 2022 , by Maagulf
ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలి: బహ్రెయిన్‌

మనామా: కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ప్రతిఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్‌లోని మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ హలా అల్-జాసిమ్ పిలుపునిచ్చారు. పౌరులు, నివాసితులందరికీ రెండు డోసులు ఉచితంగా అందించబడుతుందన్నారు. కరొనా వైరస్‌ బారి నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ http://www.healthalert.gov.bh లేదా బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్ ద్వారా లేదా 444కు కాల్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అల్-జాసిమ్ పేర్కొన్నారు. మొదటి డోస్ తీసుకున్న తేదీ నుండి 21 రోజుల తర్వాత తప్పనిసరిగా రెండవ డోస్ తీసుకోవాలని సూచించారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com