సౌదీలో స్మగ్లింగ్ ప్రయత్నాలు భగ్నం.. 80 మంది అరెస్ట్
- October 12, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని జజాన్, అసిర్‌లలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేసినట్లు సౌదీ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మూడు టన్నులకు పైగా నార్కోటిక్ ఖట్, 772 కిలోల హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. జజాన్, అసిర్ ప్రాంతాలలో సెక్యూరిటీ పెట్రోలింగ్ సిబ్బంది స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకుందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలకు సంబంధించి 80 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపింది. మెడికల్ సర్క్యులేషన్ నియంత్రణకు లోబడి 206,340 టాబ్లెట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అనుమానితుల్లో 30 మంది సౌదీ పౌరులు కాగా.. మిగతా వారు యెమెన్, ఇథియోపియా, ఎరిట్రియాకు చెందిన వారు ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష