ట్రాఫిక్ జామ్ ప్రాంతాలపై కువైట్ ఫోకస్
- October 13, 2022
కువైట్: ముష్రిఫ్ రౌండ్అబౌట్తోపాటు అల్-గౌస్ స్ట్రీట్, సబా అల్-సలేం రౌండ్అబౌట్ ఆరవ రింగ్ రోడ్‌ను ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సందర్శించి ట్రాఫిక్ జామ్‌లపై సమీక్షించారు. ముఖ్యంగా ఉదయం సమయంలో రద్దీ అధికంగా ఉంటుందని, ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అల్-ఖలేద్ ట్రాఫిక్ జామ్‌లకు కారణాలపై ఆరా తీశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వీలైనంత త్వరగా పరిష్కారాలను వెతకాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్లయ్యే ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, అంతర్గత మంత్రిత్వ శాఖ, అధికారుల మధ్య సహకారాన్ని తీవ్రతరం చేయాలని అధికారులకు అల్-ఖాలీద్ సూచించారు. అల్-ఖాలీద్ వెంట ట్రాఫిక్, ఆపరేషన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ జమాల్ అల్-సయెగ్, పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజినీర్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సుహా అష్కనాని, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్