యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేసే ఆహార పదార్ధాలు...

- October 15, 2022 , by Maagulf
యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేసే ఆహార పదార్ధాలు...

మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీనినే గౌట్ అంటారు.గౌట్ సమస్య నుంచి...మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీనినే గౌట్ అంటారు. గౌట్ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ఆహారపు అలవాట్లు మీరు పాటించాలి. అలాగే మెడిసిన్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. మద్యం, చక్కెరతో చేసిన పదార్థాలకు వీలైనంతా దూరంగా ఉండాలి. ఇక ప్యూరీన్స్‌ ఎక్కువగా ఉండే మాంసం, చికెన్, పప్పుధాన్యాలు వంటి ఆహారాలను కూడా తగ్గించాలి. ప్యూరీన్స్‌ రకం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోకూడదు. కాలీఫ్లవర్, ఆస్పరాగస్, బచ్చలికూర, బటానీలు, పుట్టగొడుగులతో తయారు చేసే కూరల్లో ఎక్కువగా ప్యూరీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోకకూడదు. యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు...


నీరు: యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే కనీసం ప్రతి రోజు 10 నుంచి 12 గ్లాస్ ల నీరు తాగటానికి ప్రయత్నం చేయాలి. నీరు యూరిక్ యాసిడ్ తో పాటు మీ శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపటానికి సహాయపడుతుంది.
చెర్రీస్ : వీటికి యూరిక్ యాసిడ్ స్థాయిను తగ్గించే శక్తి ఉంది. చెర్రీస్ ను అల్పాహారంగా తీసుకుంటే ఇంకా మంచిది. ఇవి రోజుకు కనీసం 200 గ్రాముల యూరిక్ యాసిడ్ ను డౌన్ చేయగలవు.

గ్రీన్ టీ: గ్రీన్ టీ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణ నూనెల కంటే ఆలివ్ ఆయిల్ తో తయారుచేసే వంటలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చక్కెరతో తయారుచేసినటువంటి జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించాలి. సమద్ర చేపలు అయిన సాల్మొన్, హెర్రింగ్, మాకెరిల్, సార్డినెస్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

బెర్రీస్: స్ట్రాబెర్రీలతో పాటు బ్లూ బెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోస్‌ ని కూడా నియంత్రణలో ఉంచుతాయి.

ఆపిల్: రోజూ భోజనం తర్వాత ఒక ఆపిల్ తినాలి. ఇందులో ఉండే మాలిక్ ఆమ్లం యూరిక్ యాసిడ్ ను న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

నిమ్మ: నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ను డౌన్ చేస్తుంది. రోజుకు రెండుసార్లు నిమ్మరసం తీసుకోవాలి.

ఫ్రెంచ్ బీన్ రసం: గౌట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ఫ్రెంచ్ బీన్స్ రసానికి ఉంది. దీన్ని రోజూ రెండుసార్లు తాగాలి.

ఆపిల్ సైడర్ వినెగార్: ఇది కూడా ఎంతో మేలు చేస్తోంది. రోజూ దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇది ఆల్కలైజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండటం వల్ల రక్తంలోని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించడానికి సహాయపడుతుంది.

పింటో బీన్స్: వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ ను తక్కువ చేయడానికి సహాయపడుతుంది. పింటో బీన్స్ తో పాటు పొద్దుతిరుగుడు విత్తనాలలోనూ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

క్యారెట్, బీట్ రూట్, దోసకాయల జ్యూస్: క్యారెట్, బీట్ రూట్, దోసకాయల జ్యూస్ లు తీసుకోవాలి. 100 మి.లీ ప్రకారం బీట్ రూట్ రసం, దోసకాయ జ్యూస్ తీసుకుని 300 మి.లీ క్యారట్ రసంలో కలిపి రోజూ తీసుకోండి. ఫ్యాట్ తక్కువ ఉండే పాల ఉత్పత్తులు, పెరుగు వంటివి కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి.

హై ఫైబర్ ఫుడ్స్: మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తాయి. రెగ్యులర్ గా ఈ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఓట్స్, ఆకుకూరలు, బ్రొకోలీ, ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీలు, దోసకాయలు, క్యారట్లు, బార్లీ మొదలగునవి తీసుకోవాలి. అరటిపండ్లు కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గిస్థాయి.
విటమిన్ సీ ఉండే పదార్థాలు : ఈ పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మీరు రోజుతినే ఆహారంలో విటమిన్ సీ సమృద్ధిగా ఉండేవాటిని తీసుకోవాలి. జామ, నిమ్మ, కివీ, ఆరెంజ్, క్యాప్సికం, టమాట, ఆకుకూరలు తీసుకోవాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com