ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు

- October 15, 2022 , by Maagulf
ఫోర్జరీ కేసులో గవర్నమెంట్ టీచర్ కు ఏడాది శిక్ష విధించిన కోర్టు

బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో అటెండెన్స్, స్టూడెంట్స్ స్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఫోర్జరీకి పాల్పడిన టీచర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత ఆ టీచర్ ను నగర బహిష్కరణ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే 2018 లో బహ్రెయిన్ లోని ఓ స్కూల్ లో పిల్లల అటెండెన్స్ రిపోర్ట్ ను ఫోర్జరీ చేశాడు. అదే విధంగా స్టడీ రిపోర్ట్స్ ను కూడా తప్పుగా చూపుతూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ విద్యాశాఖ కు కంప్లైంట్ చేశాడు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో టీచర్ తప్పు చేసినట్లు నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో దోషిగా తేలటంతో ఆ టీచర్ కు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com