మారుతితో ప్రబాస్.! షాకింగ్ అప్డేట్ ఇదిగో.!
- October 15, 2022
ప్రబాస్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ప్రబాస్ వారం రోజులు డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
వరుస సినిమాలతో అది కూడా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా వున్న ప్రబాస్, మారుతికి డేట్లు కేటాయించడం నిజంగా షాకింగ్ అంశమే. అసలు ఈ సినిమాలో నటించొద్దు మొర్రో అంటూ ప్రబాస్‌ని ఫ్యాన్స్ వారిస్తున్నా అప్పుడెప్పుడో మారుతికి ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడు ప్రబాస్.
‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత, కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని, మారుతి ఈ సినిమాని పట్టాలెక్కించేశాడు. అయితే, లేటెస్టుగా తన భారీ సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ప్రబాస్, మారుతి కోసం వారం రోజులు డేట్లు కేటాయించాడట. దాంతో, ప్రబాస్‌తో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు మారుతి రంగం సిద్ధం చేస్తున్నాడట.
ఈ సినిమాలో ప్రబాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారన్న ప్రచారం వుంది. అందులో మాళవికా మోహనన్ అధికారికంగా కన్ఫామ్ అవ్వగా మిగిలిన ఇద్దరు హీరోయిన్ల వివరాలు ఇంకా తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!