జనసైనికుల అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

- October 16, 2022 , by Maagulf
జనసైనికుల అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

విశాఖపట్నం: వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటన పట్ల జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అమాయకులను అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేది జన నాడిని నొక్కేయడమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైస్సార్సీపీ చెబుతుందా?.. మేం ఎక్కడికి వెళ్తామో వైస్సార్సీపీ నేతలకు చెప్పాలా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పర్యటనను 3 నెలల క్రితమే ఖరారు చేశామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమం చేపట్టామని, విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాలనేది జనసేన సిద్ధాంతమని చెప్పారు. వైస్సార్సీపీ నేతలవి ఎప్పుడు బూతు పురాణాలే తప్ప.. సమస్యలను పరిష్కారించలేదని ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపామన్నారు.

ప్రభుత్వం గర్జించడం ఏంటి ? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో ఉన్నవారు గర్జిస్తామంటారేంటి? పథకాలు అమలు చేయాలి.. నిరసన తెలుపుతామంటే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వంతో పోటీ మాకెందుకు. ఎన్నికల టైంలోనే పోటీ వుంటుందన్నారు. అధికారులు మామీద జులుం చూపించారు. ప్రభుత్వానికి అండగా వున్నారు. ఏపీ పోలీసులంటే నాకు గౌరవం లేదన్న వ్యక్తి సీఎం. ఆయన దగ్గర మీరు పనిచేస్తున్నారని ఆగ్రహించారు. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారట అంటూ జనసేన కార్యకర్తలు ఫోన్లు చేశారు. నన్ను లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది.?. మేం ఏమన్నా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామా అని ప్రశ్నించారు. వైస్సార్సీపీకి పోటీగా కార్యక్రమాలు చేయాలనేది తమ ఉద్దేశం కాదని, సమస్యపైనే మాట్లాడుతామని, ఎన్నికల సమయంలో పోటీ పెట్టుకుందామని పవన్‌ అన్నారు. నిన్న ఎయిర్‌పోర్టు దగ్గర పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. పోలీస్‌ శాఖపై తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ప్రభుత్వ సూచనలు పాటిస్తారని, నిన్న జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం చూపారని పవన్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com