గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు కొత్త రాడార్
- October 16, 2022
యూఏఈ: మసాఫీ రోడ్డులో కొత్త రాడార్‌ను ఏర్పాటు చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించారు. 2022 అక్టోబర్ 17 నుండి ఈ కొత్త రాడార్ ఉల్లంఘనలకు పాల్పడే ట్రక్కులు, గడువు ముగిసిన వాహనాలను గుర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా రాడార్ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. మసాఫీ రోడ్డులో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈ రాడార్‌ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ విభాగంలోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. పర్మిట్ లేకుండా లేదా అనుమతించబడిన గంటల తర్వాత రహదారిని ఉపయోగించే ట్రక్కుల ఉల్లంఘనలను రాడార్ పర్యవేక్షిస్తుందన్నారు. ఇది గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. వాహనదారులు తమ వాహన లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వేగ పరిమితులను పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!