నూతన పాలసీ-రూ.25కోట్లతో..
- April 20, 2016
రాష్ట్రంలోని యువతీయువకుల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్ర యూత్ సర్వీసెస్ డైరక్టరేట్ అధికారులు యూత్ పాలసీని సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రి టీ పద్మారావు, రాష్ట్ర యూత్ సర్వీసెస్ సెక్రటరీ బీ వెంకటేశం పాలసీకి మెరుగులు దిద్దారు. సీఎం కేసీఆర్ పరిశీలనలో ఈ ముసాయిదా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆమోదం తర్వాత అధికారులు విధాన ప్రకటన చేయనున్నారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని కోటి 4లక్షలమంది యువతీయువకులకు ఉపయోగపడేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. రూ 25కోట్ల వ్యయంతో హైదరాబాద్ కేంద్రంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను (ఈడీఐ), ప్రతీ జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణాకేంద్రాలను నెలకొల్పనున్నారు.రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచే యువతీయువకులకు రాష్ట్రస్థాయి అవార్డులను ఇచ్చి సత్కరించనున్నారు. ఈ పాలసీపైన ఇప్పటికే మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఈ ప్రణాళికలపై చర్చించారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు ఇచ్చే రుణాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉండే కుటుంబాల యువకులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో యువతీయువకులకోసం అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు.. పత్రికల్లో వ్యాసాలను ప్రచురించిన విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచిన యువజన ముసాయిదా ప్రణాళిక దేశానికే ఉపయోగపడేవిధంగా ఉన్నదని కొనియాడారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







