కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్

- October 18, 2022 , by Maagulf
కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్

కువైట్: కువైట్ నాల్గవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం నిలిచిందని ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ సభ్యుడు తలాల్ అల్-ఖరాఫీ తెలిపారు. గత ఏడాది USD 2.362 బిలియన్ల విలువైన ట్రేడ్ ఎక్స్ఛేంజీ రెండు దేశాల మధ్య జరిగిందని పేర్కొన్నారు.  చాంబర్ హెడ్‌క్వార్టర్స్‌లో భారత ప్రతినిధి బృందానికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో తలాల్ అల్-ఖరాఫీ పాల్గొని మాట్లాటారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలతో ఆర్థిక, వాణిజ్యం ముడిపడి ఉన్నాయన్నారు. భారత అధికారులు కువైట్‌తో అత్యున్నత స్థాయి వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయాలని, రెండు దేశాల వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. భారత ప్రతినిధి బృందానికి బరిష్ మితా సారథ్యం వహించారు. భారత ప్రతినిధి బృందంలో ఆహారం, దుస్తులు, ఉక్కు కర్మాగారాలు, బట్టలు, ఎరువుల తదితర రంగాలకు చెందిన 25 కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com