ఎన్టీయార్‌కి జపాన్‌లో వీరాభిమాని.!
- October 20, 2022
ఎన్టీయార్‌కి జపాన్‌లోనూ వీరాభిమానులున్నారండోయ్. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ జపాన్ ప్రమోషన్ల నిమిత్తం ఎన్టీయార్ జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్టీయార్ బస చేస్తున్న హోటల్లో సిబ్బంది ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జపాన్‌లో పలువురు అభిమానులు రాసిన నోట్స్ అన్నీ, ఎన్టీయార్ వద్దకు తీసుకొచ్చి స్పెషల్ గిఫ్ట్‌గా అందించారు.
అది చూసి ఎన్టీయార్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 21న ‘ఆర్ఆర్ఆర్’ జపాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఎన్టీయార్, రామ్ చరణ్, జక్కన్నలతో సహా జపాన్‌లోనే మకాం పెట్టారు.
అక్కడి మీడియా ఛానెళ్లతో ఇంటర్వ్యూలిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే, సతీ సమేతంగా జపాన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్లతో పాటూ, అక్కడి ఫేమస్ ఫుడ్‌నీ, హిస్టారికల్ ప్లేసెస్‌ని కూడా కవర్ చేస్తున్నాడు చరణ్.
ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆస్కార్ బరిలో సైతం నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీయార్, రామ్ చరణ్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్న సంగతీ తెలిసిందే. ఇక, జపాన్‌లో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!