భార్య పై భర్త సివిల్ దావా: Dh500,000 చెల్లించాలని డిమాండ్
- October 20, 2022
అబుధాబి: నగలు దొంగిలించాడని ఆరోపించిన భార్యపై ఓ భర్త 500,000 దిర్హామ్‌లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేసిన సివిల్ దావాను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుభాబి రెసిడెంట్ పై తన భార్య ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించాడని ఆరోపించింది. కానీ అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, అప్పీల్స్ కోర్ట్ రెండూ తగిన సాక్ష్యం లేని కారణంగా భర్తపై నమోదైన ఆరోపణలను కొట్టివేశాయి. అనంతరం తన భార్య చర్య తన ప్రతిష్టను దెబ్బతీసిందని, భౌతిక, నైతిక నష్టాలను ఎదుర్కొన్నట్లు భర్త పరిహారం కోరుతూ ఆమెపై సివిల్ దావా వేశాడు. రెండు కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలను కోర్టుకు సమర్పించాడు. అయితే, భర్త విషయంలో సదరు మహిళ(అతని భార్య) చట్టబద్ధంగా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. భర్త ప్రతిష్ట దెబ్బతిన్నదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పరిహారం వాదనలను తిరస్కరించి, కేసును కొట్టివేసింది.
తాజా వార్తలు
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం