భార్య పై భర్త సివిల్ దావా: Dh500,000 చెల్లించాలని డిమాండ్

- October 20, 2022 , by Maagulf
భార్య పై భర్త సివిల్ దావా: Dh500,000 చెల్లించాలని డిమాండ్

అబుధాబి: నగలు దొంగిలించాడని ఆరోపించిన భార్యపై ఓ భర్త 500,000 దిర్హామ్‌లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేసిన సివిల్ దావాను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుభాబి రెసిడెంట్ పై తన భార్య ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించాడని ఆరోపించింది. కానీ అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, అప్పీల్స్ కోర్ట్ రెండూ తగిన సాక్ష్యం లేని కారణంగా భర్తపై నమోదైన ఆరోపణలను కొట్టివేశాయి. అనంతరం తన భార్య చర్య తన ప్రతిష్టను దెబ్బతీసిందని, భౌతిక, నైతిక నష్టాలను ఎదుర్కొన్నట్లు భర్త పరిహారం కోరుతూ ఆమెపై సివిల్ దావా వేశాడు. రెండు కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలను కోర్టుకు సమర్పించాడు. అయితే, భర్త విషయంలో సదరు మహిళ(అతని భార్య) చట్టబద్ధంగా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. భర్త ప్రతిష్ట దెబ్బతిన్నదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పరిహారం వాదనలను తిరస్కరించి, కేసును కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com