కువైట్ ఒక సురక్షిత దేశం
- June 16, 2015
120 దేశాలనుండి వచ్చిన 2 మిలియన్లకు పైగా శ్రామికులు, కువేట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తున్నారని, వారి శ్రమ అభినందనీయమని విదేశాంగశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (.ఐ. ఎల్. ఓ.) వారి అన్ని కార్యక్రమాలలో కువైట్ పాల్గోవడమే కాకుండా, వారి ప్రణాళికా కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం 3,00,000 పౌండ్లను విరాళంగా ఇస్తోందని, నిన్న .ఐ. ఎల్. ఓ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనిజేషన్ ఫర్ మైగ్రేషన్ వారి ఆధ్వర్యంలో ఈశాఖవారు నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో విదేశాంగ శాఖ ఫాలోఅప్ అండ్ కొఆర్దీనేషన్ డైరక్టర్ - అంబాసిడర్ నాస్సర్ అల్ సూబైహ్ చెప్పారు. కార్మికుల నైపుణ్యాన్ని మెరుగుపర్చే దిశగా రూపొందించిన డెవాలప్‌మెంటు ప్రోజక్టు - "మానవ హక్కుల రంగంలో కువైట్ యొక్క ముఖ్య పాత్ర" పధకంలో ఈ శిక్షణ ఒక భాగమని ఆయన తెలిపారు.
కువైట్ డిప్లమటిక్ ఇన్‌స్టీట్యూషన్ డిరెక్టర్ జనరల్, రాయబారి అబ్దుల్ అజీజ్ అల్-శరేఖ్ తన ముఖ్య ప్రసంగంలో తెలిపారు.
కువైట్లో ఐ. ఓ. ఎం. మిషన్ ప్రెసిడెంట్ ఇమాన్ ఎర్కత్ మాట్లాడుతూ, దేశాల అభివృద్ధికి, వారు కార్మికుల హక్కులను గౌరవించటానికి దగ్గర సంబంధం ఉందని, ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తికి, కువైట్ సురక్షిత ఆశ్రయమని, తమ న్యాయవ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సదస్సులలో నిపుణుల సహాయ సహకారాలను తీసుకుందని ఆమె వెల్లడించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







