సోయా సెనగల టిక్కీ

- June 16, 2015 , by Maagulf
సోయా సెనగల టిక్కీ

 

 

కావలసిన పదార్ధాలు:

  • కాబూలీ సెనగలు               - 1/2 కప్పు
  • సోయా చంక్స్ / గ్రాన్యూల్స్ - 1/2 కప్పు
  • పుదీనా తురుము              - 1 టేబుల్ స్పూను
  • పచ్చిమిర్చి తురుము          - 1 టీ స్పూను
  • అల్లం తురుము                 - 1 టీ స్పూను
  • నూనె                              - 2 టీ స్పూన్లు
  • ఉప్పు                             – తగినంత

 

చేయు విధానం:

  • సెనగలని ఉడికించి నీళ్ళు వంపేయాలి.
  • సోయా చంక్స్ లేదా గ్రాన్యూల్స్ ని సుమారు పావుగంటసేపు నీళ్ళలో నానబెట్టాలి.
  • తరవాత నీళ్ళు పిండేసి, వీటికి ఉడికించిన సెనగలు, పుదీనా జోడించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.
  • ఇప్పుడు పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న టిక్కీల మాదిరిగా చేసుకొని, నాన్స్టిక్ పాన్ మీద రెండువైపులా కాల్చి తీయాలి.
  • వీటికి ఏదైనా చట్నీ నంజుకుంటే సరి.
  • హృద్రోగాలతో బాధపడేవాళ్ళకి ఇది ఆరోగ్యకరమైన స్నాక్ ఫుడ్.

 

--- కె. హరిత, కాలిఫోర్నియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com