చేతిని కోల్పోయిన కార్మికుడికి Dh110,000 పరిహారం

- October 21, 2022 , by Maagulf
చేతిని కోల్పోయిన కార్మికుడికి Dh110,000 పరిహారం

యూఏఈ: వర్క్‌సైట్లో గాయం కారణంగా తన కుడి చేయి భాగాన్ని కోల్పోయిన ఒక ఆసియా కార్మికుడికి నష్టపరిహారంగా Dh110,000 చెల్లించాలని అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు తాను పనిచేస్తున్న కంపెనీలో జరిగిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా Dh170,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. వర్క్‌షాప్‌లో పని చేస్తున్నప్పుడు గాయపడినట్లు, దాని ఫలితంగా కుడి చేయి వేళ్ల నుండి మోచేయి వరకు తీసివేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. దీనికి సంబంధించిన వైద్య నివేదికను కోర్టుకు సమర్పించాడు. వర్క్ సైట్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని, జరిగిన నష్టానికి తనకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. అదే మయంలో కంపెనీ తరపున న్యాయవాది సివిల్ కోర్టుకు కేసును విచారించే అధికార పరిధి లేదని, చట్టం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత బాధితుడు దావాను దాఖలు చేశాడని వాదించారు. కానీ కోర్టు అతని వాదనలను తిరస్కరించింది. ఇరు పక్షాల నుండి విన్న తర్వాత అబుధాబి కుటుంబ, సివిల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ న్యాయమూర్తి నష్టపరిహారం కింద కార్మికుడికి Dh110,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించారు. అలాగే కార్మికుని న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com