18 రోజులైనా దొరకని ఒమానీ మహిళ అచూకీ
- October 21, 2022
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ఇజ్కీ నుండి 18 రోజుల క్రితం తప్పిపోయిన హమిదా హమ్మూద్ అల్ అమ్రియా ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. తప్పిపోయిన మహిళ గురించి ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా 9999 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రచారంలో ఉన్న కరపత్రం నిజమైంది కాదని, గతంలో జరిగిన మరో సంఘటనకు సంబందించినదని ఒమన్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, సుల్తాన్ కబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్ మద్దతుతో తప్పిపోయిన మహిళను వెతకడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సిమా గ్రామంతోపాటు ఇజ్కి విలాయత్‌లోని దాని పొరుగు గ్రామాలలో గాలింపు చర్యలను ఉధృతం చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి