18,427 మంది అక్రమ నివాసితుల స్టేటస్ సర్దుబాటు

- October 21, 2022 , by Maagulf
18,427 మంది అక్రమ నివాసితుల స్టేటస్ సర్దుబాటు

కువైట్: 2011 నుండి సెప్టెంబర్ 2022 చివరి వరకు 18,427 మంది చట్టవిరుద్ధమైన నివాసితుల స్థితిని (బెడౌన్) ను సర్దుబాటు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ద స్టేటస్ అడ్జస్ట్ మెంట్ డిపార్టుమెంట్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ అల్-వాహిబ్ తెలిపారు. 9,372 మంది అక్రమ నివాసితులు అన్ని రాష్ట్ర ఏజెన్సీలలో తమ స్థితిని సర్దుబాటు చేయడానికి విధానాలను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇందులో 12,901 మంది సౌదీ జాతీయత కలిగి ఉన్నారని, వీరిలో 5,945 మంది రాష్ట్ర ఏజెన్సీలలో తమ స్థితిని సర్దుబాటు చేయడానికి విధానాలను పూర్తి చేశారని, మరో 6,956 మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆ తర్వాత 1,835 మంది వ్యక్తులు ఇరాకీ జాతీయత, 858 మంది సిరియన్ జాతీయత, ఇరాన్ జాతీయతకు చెందిన 318 మంది వ్యక్తులు, జోర్డాన్ జాతీయతకు చెందిన 116 మంది.. వీటితోపాటు ఇతర దేశాలకు చెందిన 2155 మంది వ్యక్తుల స్టేటస్ ను సవరించినట్లు అల్-వాహిబ్ వివరించారు. కువైట్‌లో అమలులో ఉన్న నివాస చట్టాల ప్రకారం తన నివాసాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి, తమ స్టేటస్(స్థితి)ని పునరుద్దరించుకోవడానికి అల్-అర్దియా ప్రాంతంలోని శివారు ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని అల్-వాహిబ్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com