మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ మాస్ క్రాకర్.!

- October 21, 2022 , by Maagulf
మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ మాస్ క్రాకర్.!

మాస్ రాజా రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ నుంచి దీపావళి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కరెక్ట్‌గా చెప్పాలంటే, దీపావళికి రావల్సిన అసలు సిసలు క్రాకర్‌లాగే వుంది ఈ టీజర్. అందుకే ధమాకా మాస్ క్రాకర్ పేరుతో ఈ టీజర్ రిలీజ్ చేశారు.
‘నేను నీలో విలన్‌ని చూస్తే, నువ్వు నాలో హీరోని చూస్తావు.. కానీ, యాక్షన్‌లోకి దిగితే, నేనో శాడిస్ట్’ని అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. అట్నుంచి ఓ బుల్లెట్ వస్తే, ఇటు నుంచి దీపావళే..’ అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. 
ఓ మాంచి మసాలా యాక్షన్‌తో రవితేజ మార్కు మాస్ డైలాగులతో టీజర్ కట్ చేశారు. కానీ, ఈ మధ్య రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలవుతున్న సంగతి తెలిసిందే. దాంతో మాస్ రాజా కాస్తా మూస రాజా అయిపోయాడన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయ్. 
మరి, ఆ డ్యామేజ్ నుంచి రవితేజ బయటపడాలంటే, ‘ధమాకా’ సూపర్ హిట్ అవ్వాల్సి వుంది. డైరెక్టర్ వైపు నుంచి ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్ కానీ, రవితేజ లక్కు ఎలా వుందో చెప్పలేం. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సినిమా డిశంబర్‌లో రిలీజ్ కానుంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com