‘గ్లోబల్ ఏవియేషన్ అవార్డు’ గెలుచుకున్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్

- October 22, 2022 , by Maagulf
‘గ్లోబల్ ఏవియేషన్ అవార్డు’ గెలుచుకున్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్

దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ గ్లోబల్ ఏవియేషన్ అవార్డ్స్‌లో బెస్ట్ ఏవియేషన్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్ అవార్డును దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB), దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) విమానాశ్రయాల ఆపరేటర్ అయిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ గెలుచుకుంది. కెనడాలోని మాంట్రియల్‌లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) 41వ జనరల్ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమలో సుస్థిరత కార్యక్రమాలను అమలు చేయడంలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్‌లలో కొన్ని DXB టెర్మినల్స్, ఎయిర్‌ఫీల్డ్‌లోని 150,000 సంప్రదాయ లైట్లకు బదులుగా LED లైట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ గ్రౌండ్ సర్వీస్ వాహనాల పరిచయం, DXB అతిపెద్ద టెర్మినల్ 2 వద్ద 15,000-ప్యానెల్ సోలార్ శ్రేణిని నిర్మించడం వంటివి ఉన్నాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో టెక్నాలజీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ బినాదై మాట్లాడుతూ.. గ్లోబల్ ఏవియేషన్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక వాతావరణ కార్యాచరణ లక్ష్యాలను సాధించడంలో యూఏఈ విస్తృత ప్రయత్నాలకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. 2016లో ఏర్పాటైన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఏవియేషన్ అవార్డ్.. విమానయాన రంగంలో విశేష కృషి చేసే ఎయిర్ పోర్ట్స్ నిర్వహణ సంస్థలకు అందజేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com