ఆహార పరిశ్రమలో 85శాతం లోకలైజేషన్: సౌదీ
- October 22, 2022
సౌదీ: 2030 నాటికి దేశంలోని 85 శాతం ఆహార పరిశ్రమను స్థానికీకరించాలని(లోకలైజేషన్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు సౌదీ అరేబియా పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) వెల్లడించింది. ఆహార దిగుమతుల వల్ల సౌదీ అరేబియాకు ఏటా SR70 బిలియన్లు ఖర్చవుతుందని MEWAలోని వ్యవస్థాపకత విభాగం సూపర్వైజర్ జనరల్ డాక్టర్ అలీ అల్-సబాన్ తెలిపారు. ఆహార రంగం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులకు అనేక అవకాశాలను అందిస్తుందన్నారు. గల్ఫ్ వ్యవస్థాపకుల ఫోరమ్‌లో భాగంగా జరిగిన “గల్ఫ్ సహకార మండలి రాష్ట్రాల ఆహార, పర్యావరణ భద్రతపై వ్యవస్థాపకత, ఆవిష్కరణల ప్రభావం” అనే సెమినార్లో అల్-సబాన్ పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి ఖర్జూర ఎగుమతుల రంగాన్ని SR2.5 బిలియన్లకు పెంచడంతో పాటు, చేపల ఉత్పత్తిని 500 శాతం పెంచి, ఎగుమతులను SR3 బిలియన్లకు పెంచాలని సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంత్రిత్వ శాఖ మార్గదర్శక ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, స్థానిక, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటుకు కృషి జరుగుతుందని, అదే సమయంలో మంత్రిత్వ శాఖ అందించే వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు అల్-సబాన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







