హిట్ అండ్ రన్. 5 గంటల్లో నిందితుడు అరెస్ట్

- October 25, 2022 , by Maagulf
హిట్ అండ్ రన్. 5 గంటల్లో నిందితుడు అరెస్ట్

యూఏఈ: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగిన ఐదు గంటలలోపు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ బుహైరా పోలీస్ స్టేషన్‌కు చెందిన దర్యాప్తు బృందం సంఘటన జరిగిన ఐదు గంటలలోపు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిందని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోవడం నేరమని, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవకికైనా ప్రమాదం జరిగితే పారిపోవడానికి బదులు వారి ప్రాణాలను కాపాడేందుకు సహాయం అందించాలని షార్జా పోలీసులు సూచించారు.  వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.  ప్రమాదానికి కారణమై వాహనాన్ని ఆపకుండా పారిపోతే ట్రాఫిక్ ఫెడరల్ చట్టం ప్రకారం.. వాహనదారుడికి 25,000 వరకు జరిమానాతోపాటు బాధితుడు గాయపడినా లేదా మరణించినా జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com