క్రికెటర్ ధోనీ నిర్మాణంలో తమిళ సినిమా.!

- October 26, 2022 , by Maagulf
క్రికెటర్ ధోనీ నిర్మాణంలో తమిళ సినిమా.!

మాజీ క్రికెటర్ ధోనీ, ఇప్పుడు సినిమాల్లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే యాక్టర్‌గా కాదండోయ్. ప్రొడ్యూసర్‌గా. ధోనీ తన భార్య సాక్షితో కలిసి నిర్మాతగా మారనున్నారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు. 
ఈ బ్యానర్‌పై అభిరుచి గల సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఈ నిర్మాణ సంస్థంలో తొలి సినిమాగా ఓ చిన్న సినిమాని రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఓ తమిళ సినిమాని ఎంచుకున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ధోనీ ఈ మధ్య తమిళ తంబీలకు బాగా దగ్గరైపోయాడు. అందుకే, తన బ్యానర్‌లో తొలి సినిమాని తమిళంలోనూ రూపొందించాలనుకుంటున్నాడు.
తమిళ హీరో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా ఓ ఫ్యామిలీ స్టోరీని ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా రూపొందించబోతున్నాడు ధోనీ. ఈ నిర్మాణ సంస్థకి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నింటినీ ధోనీ భార్య సాక్షి పర్యవేక్షించనుందట. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది.
కాగా, మొదట చిన్న సినిమాతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ హిజ్ ప్రొడక్షన్ టీమ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com