టిఆర్ఎస్తో పొత్తు ఉండదు: రాహుల్
- October 31, 2022 
            హైదరాబాద్: బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళిక బద్ధంగా నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని ఆయన చెప్పారు. జోడో యాత్ర కొత్తూరుకు చేరుకున్న సందర్బంగా ఆయన మాట్లాడారు. ఫిట్నెస్ కోసం అయితే జిమ్ చేస్తే సరిపోతుంది.. పాదయాత్ర చేయాల్సిన పనిలేదన్నారు. దేశ మనుగడ కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నామని అన్నారు. రాజకీయం, ఎన్నికల కోసం యాత్ర చేయడం లేదన్న ఆయన.. ప్రజల మధ్య సోదర భావం పెంచేందుకే చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఓబీసీ చేపట్టిన జనాభా లెక్కల గణాంకాలను బహిరంగ పరచాలని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాతే.. ఏఐసీసీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని.. ఇతర పార్టీల్లో ఆ ప్రజాస్వామ్యం లేదని ఆయన విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే బీజేపీ టీఆర్ఎస్లు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ఇక పొత్తు గురించి ప్రస్తావించిన ఆయన.. టీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. అయితే రెండు సిద్ధాంతాల మధ్యే పోటీ జరుగుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్నారు. విపక్షాల మధ్య ఐక్యత రావాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







