కువైట్ లో భారత రాయబారి సిబి జార్జ్ కి ఘనంగా వీడ్కోలు
- October 31, 2022
కువైట్: భారత రాయబారి సిబి జార్జ్ తన పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎంబసీలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా తనకు సహకరించిన వారందరికి సిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం- కువైట్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి తన హయాంలో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశ సంబంధాలను మరింత పటిష్టం చేసిందని జార్జ్ అన్నారు. కువైట్‌లోని చాలా కుటుంబాలు దశాబ్దాలుగా భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తజికిస్తాన్ రాయబారి డాక్టర్ జబిదుల్లా జబిడోవ్, ఉజ్బెకిస్తాన్ రాయబారి డాక్టర్ బహ్రోమ్ అలియోవ్, టోగో రాయబారి మొహమ్మద్ సాద్ ఓరో, మెక్సికో రాయబారి మిగ్యుల్ ఏంజెల్ ఇసిడ్రో, ఎంబసీ దౌత్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు







