దుబాయ్‌ మెటా ఫిల్మ్ ఫెస్ట్‌: ‘ముత్తయ్య’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు

- October 31, 2022 , by Maagulf
దుబాయ్‌ మెటా ఫిల్మ్ ఫెస్ట్‌: ‘ముత్తయ్య’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు

దుబాయ్‌: దుబాయ్‌లో జరిగిన మెటా ఫిల్మ్ ఫెస్ట్ లో తెలుగు చలనచిత్రం ‘ముత్తయ్య’కి దర్శకత్వం వహించిన భాస్కర్ మౌర్య ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సంవత్సరం ఫెస్టివల్‌కి ఎంపికైన ఏకైక భారతీయ చలనచిత్రం ఇదే కావడం గమనార్హం. చనిపోయే ముందు సినిమాల్లో నటించాలని కలలు కనే ఓ 70 ఏళ్ల వృద్ధుడి కథతో ఈ చిత్రాన్ని భాస్కర్ మౌర్య తెరకెక్కించాడు.హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, బృందా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇరాన్, యూఏఈ, స్పెయిన్, యూఎస్ఏ, టర్కీ మొదలైన దేశాల చిత్రనిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్లతో కూడిన జ్యూరీని ముత్తయ్య చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. భాస్కర్ మౌర్య తరపున అవార్డును అందుకున్న బృందా ప్రసాద్.. జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్‌లో ముత్తయ్య చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు జ్యూరీకి, మెటా ఫిల్మ్ ఫెస్ట్ బృందానికి బృందా ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ముత్తయ్య చిత్రంలో కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, మౌనిక బొమ్మి, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్, కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com