‘ఆదిపురుష్’ తగ్గి తీరాల్సిందే.! తప్పేదే లే.!
- October 31, 2022
సంక్రాంతి రేస్‌లో ‘ఆదిపురుష్’ అని ఊరికి ముందే.. అదేనండీ.. ఎప్పుడో కన్ఫామ్ చేసేశారు మేకర్లు. ఆ తర్వాతే చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర హీరోలు రేస్‌లోకి వచ్చారు. ఇదీ వాస్తవం.
అయితే, అందరి కన్నా ముందు రేస్‌లో నిలిచిన ‘ఆది పురుష్’ ఇప్పుడు వెనక్కి తగ్గక తప్పేలా కనిపించడం లేదు. ప్యాన్ ఇండియా సినిమా అయిన ‘ఆదిపురుష్‌కి సంక్రాంతి లాంటి సీజన్ వుండాలి. కానీ, పోటీ మాత్రం ఆ స్థాయిలో వుండకూడదనేది కొందరు సినీ మేధావుల ఉచిత సలహా.
ఉచితమే అయినా ఆ సలహానీ తూచా తప్పకుండా పాఠించాలనుకుంటోందట ‘ఆది పురుష్’ టీమ్. రేస్ నుంచి పక్కకు తప్పుకోవాలనుకుంటోందట. దాదాపు నిర్ణయం తీసేసుకున్నట్లే. ఇక, అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయి.
అంతేకాదు, ‘ఆదిపురుష్’ టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. అది కూడా సరిచేసుకుని తీరాల్సిందే. టెక్నికల్ వర్క్ స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు కూడా ఇంకాస్త టైమ్ అవసరమయ్యేలా వుందన్నది తాజా సమాచారమ్. సో, ఆయా కారణాల వల్ల ‘ఆది పురుష్’ని రేస్ నుంచి తప్పించేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







