లుసైల్ స్టేడియం చుట్టూ రోడ్ల మూసివేత

- November 01, 2022 , by Maagulf
లుసైల్ స్టేడియం చుట్టూ రోడ్ల మూసివేత

ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలకు చెందిన ఫుట్ బాల్ అభిమానులు ఖతార్ చేరుకుంటున్నారు. మరోవైపు పలు హోటళ్లలో రూముల బుకింగ్ పూర్తయినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ఫుట్ బాల్ మ్యాచులు జరిగే లుసైల్ స్టేడియం చుట్టూ రోడ్లను నవంబర్ 1 నుండి  మూసివయనున్నారు. ఈ మేరకు తన @Roadto2022Go ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సుప్రీం కమిటీ వెల్లడించింది. స్టేడియం చుట్టూ మూసివేసిన రోడ్లు, యాక్సెస్ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డ్రాప్-ఆఫ్/పికప్ ప్రాంతాలను స్పష్టంగా తెలుపుతూ.. ఓ మ్యాప్ ను షేర్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com