సౌదీలో 43 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్

- November 01, 2022 , by Maagulf
సౌదీలో 43 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్

రియాద్: 2021లో ఎయిర్ ట్రాఫిక్ 43% పెరుగుదలను నమోదు చేసిందని, ఓడరేవులలో ఇది 7 శాతంగా ఉందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT)  ప్రకటించింది. 2021లో సుమారు 497 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎయిర్ పోర్టులో కార్యాకలాపాలు నిర్వహించాయి. వీటి ద్వారా సుమారు 49 మిలియన్ల మంది ప్రయాణికులు(30% పెరుగుదల) ప్రయాణించారు. ఇందులో విదేశీ విమానాల సంఖ్య 20% పెరుగుదల(126,000 ప్రయాణికులు) ఉండగా.. దేశీయ విమానాలు 53% (371,000) పెరుగుదల నమోదైందని అథారిటీ పేర్కొంది. రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 33% విమానాలతో మొదటి స్థానంలో ఉందని, జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్‌పోర్ట్ 26%తో రెండు, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 13%తో మూడవ స్థానంలో ఉన్నాయి. ప్రయాణీకుల సంఖ్య పరంగా కింగ్ ఖలీద్ విమానాశ్రయం అత్యధికంగా 35%, కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయం 29%, ఆపై కింగ్ ఫహద్ విమానాశ్రయం 12% వరుసగా స్థానం పొందాయి.

13.2 వేల నౌకలు

ఓడరేవులలో నౌకల కదలిక 7% పెరుగుదలను నమోదు చేసి, 13.2 వేల నౌకలకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని ఓడరేవుల ద్వారా ప్రయాణించే మొత్తం ప్రయాణీకుల సంఖ్య 2021లో 652,000కి చేరుకుంది. 2020 సంవత్సరంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 33% పెరిగిందని అథారిటీ తెలిపింది. మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 71% మంది ప్రయాణికులతో జాజాన్ పోర్ట్ జాబితాలో తొలిస్థానంలో ఉన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com