ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఎఫ్‌డిఐ గమ్యస్థానంగా దుబాయ్

- November 01, 2022 , by Maagulf
ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఎఫ్‌డిఐ గమ్యస్థానంగా దుబాయ్

యూఏఈ: ప్రపంచంలోని ప్రముఖ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) హబ్‌గా దుబాయ్ తన హోదాను మరోసారి నిలుపుకుంది. దుబాయ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ప్రచురించిన డేటా ప్రకారం.. 2022 మొదటి ఆరు నెలల్లో ఎమిరేట్ 492 ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్‌లను ఆకర్షించింది. 2021లో ఇదే కాలంతో పోలిస్తే 80.2 శాతం పెరగడం గమనార్హం. గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్‌లను ఆకర్షించడంలో దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం(56 శాతం)లో ఉంది. దుబాయ్ H1 2022లో Dhs13.72bn  ఎఫ్‌డిఐ పెట్టుబడులను ఆకర్షించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 14.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే H1 2022లో 15,164 కొత్త ఉద్యోగాలను దుబాయ్ సృష్టించింది.  గత సంవత్సరం కంటే 33.5 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను మరింత వైవిధ్యపరచడం, భవిష్యత్-కేంద్రీకృత రంగాలలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అవకాశాలను మెరుగుపరచడం, దుబాయ్ అభివృద్ధి ప్రయాణానికి తమ వ్యూహాత్మక లక్ష్యాలుగా ఉన్నాయని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పేర్కొన్నారు. దుబాయ్‌లోకి వచ్చిన ఎఫ్‌డిఐ ప్రాజెక్టుల్లో 56 శాతం గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు కాగా, 29 శాతం కొత్త పెట్టుబడి రంగాలకు చెందినవి, ఆరు శాతం వెంచర్ క్యాపిటల్ ఆధారిత ఎఫ్‌డిఐ ప్రాజెక్టులు, 5 శాతం విలీనాలు, సముపార్జన  M&A) ప్రాజెక్టులు, 3 శాతం పునఃపెట్టుబడులు కాగా.. జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు 1 శాతం వరకు ఉన్నాయి. "దుబాయ్ ఎఫ్‌డిఐ మానిటర్" డేటా ప్రకారం.. 2022 ప్రథమార్ధంలో మొత్తం ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్‌లలో 62 శాతం మధ్యస్థ, హై-టెక్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, 38 శాతం తక్కువ-టెక్ పెట్టుబడి ప్రాజెక్టులు అని తెలిపింది. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో యూకే (36 శాతం), యూఎస్ (20 శాతం), ఫ్రాన్స్ (10 శాతం), సింగపూర్ (5 శాతం), స్విట్జర్లాండ్ (4 శాతం) ఉన్నాయి. ఎఫ్డీఐ ప్రాజెక్ట్‌ల పరంగా గమనిస్తే.. యూఎస్ (18 శాతం), యూకే(15 శాతం), భారతదేశం (13 శాతం), సింగపూర్ - ఫ్రాన్స్ (4 శాతం ఒక్కొక్కటి) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com