ఇండియాలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన: బాధితులకు సౌదీ నేతల సంతాపం
- November 02, 2022
రియాద్: పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో కేబుల్ వంతెన కూలి కనీసం 135 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బాధితులకు సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ మేరకు భారత అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు ఓ లేఖను పంపారు.
దీపావళి లేదా ఛత్ పూజ సెలవుల నేపథ్యంలో వందలాది మంది సందర్శకులు ఆదివారం సాయంత్రం 230 మీటర్ల పొడవైన కేబుల్ వంతెనపై నిలబడి ఆస్వాదిస్తుండగా.. అది కూలి సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 135 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు.
గుజరాత్‌లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌కు 200 కి.మీ దూరంలో ఉన్న మోర్బీలోని ఈ కేబుల్ వంతెనను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో నిర్మించారు. ఇటీవల ఈ కేబుల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల కోసం తెరిచారు. ఇది తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాలుగు రోజులకే కుప్పకూలింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







