ఎమిరేట్స్ ప్రయాణికులకు బంపరాఫర్: బోర్డింగ్ పాసుతో స్పెషల్ డిస్కౌంట్స్
- November 02, 2022
యూఏఈ: వింటర్ సీజన్ ను పురస్కరించుకొని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తన ప్రసిద్ధ మై ఎమిరేట్స్ పాస్‌ను తిరిగి తెస్తున్నట్లు ప్రకటించింది. 2022 నవంబర్ 1 నుండి 2023 మార్చి 31 వరకు మై ఎమిరేట్స్ వింటర్ పాస్ తో యూఏఈలోని 500 కంటే ఎక్కువ ప్రదేశాలలో ప్రత్యేకమైన ఆఫర్లను పొందవచ్చు. వింటర్ పాస్ తో దుబాయ్, యూఏఈలో ప్రయాణీకులు వందలాది రిటైల్, లీజర్, డైనింగ్ అవుట్లెట్లు, లగ్జరీ స్పాలు, ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చని ఎమిరేట్స్ వెల్లడించింది. మై ఎమిరేట్స్ పాస్ ఆఫర్ల పూర్తి వివరాల కోసం https://www.emirates.com/ae/english/experience/my-emirates-pass/ని సందర్శించాలని సూచించింది. దీనితోపాటు ఎమిరేట్స్ ప్రయాణీకులు టూర్ దుబాయ్ ఒక గంట క్రీక్ సందర్శన కింద క్రూయిజ్ కాంప్లిమెంటరీ టిక్కెట్‌ను పొందవచ్చు. అలాగే ఈ డిసెంబర్లో జరుగనున్న దుబాయ్ రగ్బీ సెవెన్స్, డీపీ వరల్డ్ టూర్ గోల్ఫ్ ఈవెంట్ల వంటి ప్రధాన క్రీడా ఈవెంట్లను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







