దారుణంగా 250 మంది మహిళలను చంపిన ఇస్లామిక్‌స్టేట్
- April 21, 2016
ఇస్లామిక్‌స్టేట్.. తమ ఆగడాలతో ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కిరాతక ఉగ్రవాదసంస్థ అది. సాటి మనుషులన్న కనీస ధర్మాన్ని కూడా మరిచి.. అమాయక ప్రజలను వూచకోత కోస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మీడియా రిపోర్ట్.. ఐఎస్ కర్కశత్వానికి అద్దం పడుతోంది. శృంగార బానిస జీవితాలను వ్యతిరేకించినందుకు గానూ ఐఎస్ ఓ నగరానికి చెందిన 250 మంది మహిళలను అతి దారుణంగా చంపేసింది.
2014 జూన్‌లో ఇరాక్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మోసుల్‌ను ఐఎస్ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి మోసుల్ ప్రాంత మహిళలు ఒంటిరిగా బయట తిరగడానికి అనుమతి లేదు. అంతేగాక.. తమ భర్తలను ఎంచుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే.. అక్కడి మహిళలకు ఉగ్రవాదులతో తాత్కాలిక వివాహం చేసి.. శృంగార బానిసలుగా మార్చేవారు. సింగాల్ పర్వతశ్రేణుల్లో నివసించే యాజిదీ వర్గీయులపై వారు సాగించిన మారణకాండ తెలిసిందే. అలా ఒక్క 2014 ఆగస్టులోనే 500 మంది యాజిదీ మహిళలను కిడ్నాప్ చేసి.. తమ స్థావరాలకు తీసుకెళ్లారు.
ఒకవేళ ఉగ్రవాదుల నిర్ణయాన్ని గనుక వ్యతిరేకిస్తే .. ఇక వారి జీవితం అక్కడితో ఆగిపోవాల్సిందే. శృంగార బానిసత్వానికి ఒప్పుకోలేదని.. గతేడాది ఆగస్టులో ఒకేసారి 19 మంది మహిళలను ఉరితీశారు. అలా.. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 250 మంది మహిళలను చంపేసినట్లు లండన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో మహిళల కుటుంబసభ్యులను కూడా చంపేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్‌ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు









