ఇండియన్ ఎంబసీలో ‘కర్ణాటక రాజ్యోత్సవ దినోత్సవం’

- November 03, 2022 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ‘కర్ణాటక రాజ్యోత్సవ దినోత్సవం’

కువైట్: భారత రాయబార కార్యాలయంలో 'కర్ణాటక రాజ్యోత్సవ' పేరుతో స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్‌ను కువైట్ ఇండియన్ ఎంబసీ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక, కళలు, వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను చార్జీ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. కర్నాటక రాష్ట్రం ఆర్థిక, పెట్టుబడి, పర్యాటక విశేషాలను వివరించారు. కువైటీలు, భారతీయులు కర్ణాటకను సందర్శించవలసిందిగా కోరారు. బెంగళూరు సిల్క్‌తో పాటు చందనం, ఫర్నీచర్, సబ్బు, నూనె, టాల్కమ్ పౌడర్, అగరబత్తుల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన కర్ణాటక ఆధునిక పారిశ్రామిక రాష్ట్రమని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉన్న రాష్ట్రమని, భారతదేశంలో కాఫీ భూమిగా పేరుగాంచిందని, సాఫ్ట్‌వేర్, సేవా ఎగుమతుల సహకారంతో రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మిల్లెట్స్-2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్ణాటకకు చెందిన జిఐ (జియోగ్రాఫిక్ ఇండికేటర్స్) ఉత్పత్తులు, మిల్లెట్ ఉత్పత్తులను ఎంబసీలో ప్రదర్శించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com