ఇండియన్ ఎంబసీలో ‘కర్ణాటక రాజ్యోత్సవ దినోత్సవం’
- November 03, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయంలో 'కర్ణాటక రాజ్యోత్సవ' పేరుతో స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్‌ను కువైట్ ఇండియన్ ఎంబసీ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక, కళలు, వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను చార్జీ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. కర్నాటక రాష్ట్రం ఆర్థిక, పెట్టుబడి, పర్యాటక విశేషాలను వివరించారు. కువైటీలు, భారతీయులు కర్ణాటకను సందర్శించవలసిందిగా కోరారు. బెంగళూరు సిల్క్‌తో పాటు చందనం, ఫర్నీచర్, సబ్బు, నూనె, టాల్కమ్ పౌడర్, అగరబత్తుల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన కర్ణాటక ఆధునిక పారిశ్రామిక రాష్ట్రమని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉన్న రాష్ట్రమని, భారతదేశంలో కాఫీ భూమిగా పేరుగాంచిందని, సాఫ్ట్వేర్, సేవా ఎగుమతుల సహకారంతో రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మిల్లెట్స్-2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్ణాటకకు చెందిన జిఐ (జియోగ్రాఫిక్ ఇండికేటర్స్) ఉత్పత్తులు, మిల్లెట్ ఉత్పత్తులను ఎంబసీలో ప్రదర్శించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







