పోప్ ఫ్రాన్సిస్‌కు బహ్రెయిన్ లో ఘన స్వాగతం

- November 04, 2022 , by Maagulf
పోప్ ఫ్రాన్సిస్‌కు బహ్రెయిన్ లో ఘన స్వాగతం

మనామా: హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో కలిసి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పోప్ ఫ్రాన్సిస్‌కు ఘన స్వాగతం పలికారు. అధికారిక స్వాగత కార్యక్రమంలో భాగంగా రాజ గార్డుల బృందం పాపల్ గీతం, ఇన్నో ఇ మార్సియా పొంటిఫికేల్, బహ్రెయిన్ జాతీయ గీతం, 21 తుపాకీల వందనం సమర్పించింది.

బహ్రెయిన్.. వివిధ విశ్వాసాలకు నిలయం: కింగ్ హమద్

HH కింగ్ హమద్ మాట్లాడుతూ.. సహనం, సహజీవనం, శాంతి ఉన్న దేశానికి ఆశీర్వాదాలు అందించాలని కోరారు. న్యాయం, ప్రేమ, సహనం వంటి విలువలను పెంపొందించే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మానవ సంస్కృతిని పునరుజ్జీవింపజేసేందుకు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో పోప్ ప్రశంసనీయమైన పాత్రపై ప్రశంసలు కురిపించారు. బహ్రెయిన్ రాజ్యంలో వివిధ విశ్వాసాల మధ్య పరస్పర సహజీవనం ఉందన్నారు.  అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. రష్యా-ఉక్రేనియన్ యుద్ధాన్ని ముగించాలని, ఈ విషయంలో అవసరమైన ఏ పాత్రనైనా  పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని కింగ్ హమద్ స్పష్టం చేశారు.

మరుపురాని అనుభవం: పోప్ ఫ్రాన్సిస్

HH పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. తనను బహ్రెయిన్ రాజ్య సందర్శనకు ఆహ్వానించిన కింగ్ హమద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. బహ్రెయిన్ లో ఉన్న భిన్న సంస్కృతులు, పురాతన-ఆధునిక సంప్రదాయాలు ఇక్కడి స్వేచ్ఛకు నిదర్శనమన్నారు. బహ్రెయిన్ లో ఉన్న "జీవన వృక్షం" (షజరత్-అల్-హయత్)ను ప్రేరణగా తీసుకోవాలనుకుంటున్నాని తెలిపారు. గత 4,500 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా మానవ ఉనికిని కలిగి ఉన్న బహ్రెయిన్ నేలపై తాను నడవడం మరుపురాని అనుభవమని పేర్కొన్నారు. రాజ్యం గొప్ప సంపదలైన ఇక్కడి సాంస్కృతిక వైవిధ్యం, శాంతియుత సహజీవనం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. బహ్రెయిన్ రాజ్యం జనాభాలో దాదాపు సగం మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. ఇది రాజ్య పరిపాలన సంస్కరణలకు నిదర్శనమన్నారు.

ఈ సందర్భంగా HM రాజు, HH పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక స్నేహం, బహ్రెయిన్ రాజ్యం-వాటికన్ మధ్య సహకార అవకాశాలు, అలాగే మానవ సమస్యలు, సేవ, ఉమ్మడి సంబంధాలను అభివృద్ధి చేసే మార్గాలను సమీక్షించారు. సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA), కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు సభ్యులు, చర్చి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com