సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- November 04, 2022
రియాద్: చట్టవిరుద్ధమైన యాంఫెటమైన్ మాత్రలను మిలియన్ల కొద్దీ అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు విఫలం చేశారు. రియాద్‌లోని ఒక గిడ్డంగిలో ఐరన్ మెషీన్ల షిప్మెంట్లో దాచి తరలిస్తున్న 1.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. ఒమన్ భద్రతా విభాగం, పన్ను, కస్టమ్స్ అథారిటీ(జకాత్) సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సౌదీ పౌరులు, ఒక జిసిసి జాతీయుడు, ఒక సిరియన్ నివాసి, ఇద్దరు బంగ్లాదేశ్ నివాసితులు, ఇద్దరు పాకిస్థానీ నివాసితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద స్మగ్లింగ్ కార్యకలాపాలు లేదా కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే కాన్ఫిడెన్షియల్ హాట్‌లైన్ 1910, అంతర్జాతీయ నంబర్ 00 966 114208417 లేదా ఇమెయిల్ [email protected]కు తెలపాలని సౌదీ ప్రభుత్వం కోరింది. విలువైన సమాచారం అందించిన వారికి ఆర్థిక రివార్డ్‌లు అందించబడతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







