బెంగళూరుకు నేరుగా విమానాన్ని ప్రారంభించిన జజీరా ఎయిర్‌వేస్

- November 05, 2022 , by Maagulf
బెంగళూరుకు నేరుగా విమానాన్ని ప్రారంభించిన జజీరా ఎయిర్‌వేస్

కువైట్: భారతదేశంలోని బెంగళూరు నగరానికి జజీరా ఎయిర్‌వేస్ తన మొదటి డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. జజీరా ఎయిర్‌వేస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయం నుండి మొదటి కార్యదర్శి డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జజీరా ఎయిర్‌వేస్ అధికారులు, కువైట్‌లోని వివిధ కర్ణాటక సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు.

కువైట్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ నంబర్ J9 431 సాయంత్రం 6:00 గంటలకు బెంగళూరుకు బయలుదేరి 01:15 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 02:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 04:50కి కువైట్ చేరుకుంటుంది.

జజీరా విమానం కువైట్ నుండి బెంగళూరుకు గురువారం, శనివారం సాయంత్రం 6:00 గంటలకు రెండు వీకెండ్ సర్వీసులను ఆపరేట్ చేయనుంది. బెంగళూరు నుండి తిరుగు ప్రయాణంలో శుక్రవారం, ఆదివారం తెల్లవారుజామున 2:00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4:50 గంటలకు కువైట్ చేరుకుంటాయని జజీరా ఎయిర్‌వేస్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com