జహ్రా నేచర్ రిజర్వ్‌ పున:ప్రారంభం

- November 05, 2022 , by Maagulf
జహ్రా నేచర్ రిజర్వ్‌ పున:ప్రారంభం

కువైట్: అల్-సబా జహ్రా నేచర్ రిజర్వ్‌ను ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ హెడ్ షేక్ అబ్దుల్లా ప్రారంభించారు. ఈ రిజర్వ్ కువైట్‌లో పర్యావరణ పర్యాటకాన్ని పెంచడం, పర్యావరణ అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కువైట్ లోని పలు దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, అనేక మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తిరించిన జహ్రా నేచర్ రిజర్వ్‌ ను 1987లో ఏర్పాటు చేశారు. ఇందులో 300 కంటే ఎక్కువ రకాల వలస, స్థానిక పక్షులను చూడవచ్చు. సందర్శన సమయం ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు ప్రత్యేక అనుమతితో ఉదయం 5:00 గంటల నుండి ప్రవేశించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com