జాన్వీ కపూర్ మళ్లీ నో చెప్పేసిందట.! అసలా వుద్దేశ్యం వుందా.? లేదా.?
- November 05, 2022
జాన్వీ కపూర్‌ని సౌత్ సినిమాల్లోకి తీసుకురావాలని మేకర్లు గత పదేళ్లుగా ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ, విఫలమవుతూ వస్తున్నారు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా.. అంటోంది కానీ, జాన్వీ బాలీవుడ్ వదిలి రానే రావడం లేదు.
తాజాగా మరోసారి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై చర్చ మొదలైంది. అందుకు కారణం ఆమె నటించిన ‘మిలి’ చిత్రమే. ఈ సినిమా లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జాన్వీ కపూర్ హైద్రాబాద్ వచ్చింది.
ఈ సందర్భంగా కొందరు నిర్మాతలు జాన్వీని కలిశారట. కొన్ని ప్రాజెక్టులు ఆఫర్ చేశారట. కానీ, జాన్వీ సింపుల్‌గా నో చెప్పేసిందట. ఇప్పటికైతే కుదరదని చెప్పేసిందట. ఇంకెప్పుడు.? అంటే రీజన్‌లెస్ ఆన్సర్స్ ఇచ్చిందట. దాంతో, విస్తుపోయారట నిర్మాతలు.
ఎన్టీయార్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఎన్టీయార్ సినిమాతో డెబ్యూ చేస్తాననీ, అలాగే రామ్ చరణ్ అన్నా ఇష్టమే అంటూ గతంలో పలు మార్లు చెప్పింది. విజయ్ దేవరకొండ కూడా జాన్వీ లిస్టులో వున్న హీరోనే. అయితే, ఇవన్నీ కేవలం మాటల వరకే. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు..అంటూ జాన్వీపై సౌత్ ఆడియన్స్ గుస్సా అవుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..







