సౌదీలో 3 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- November 05, 2022
రియాద్: ట్రక్కులో దాచి 3.25 మిలియన్ క్యాప్‌గాన్ ట్యాబ్లెట్‌లను జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ పేర్కొన్నది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో కలిసి దిగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను కఠినతరం చేయడం కొనసాగుతుందని తెలిపింది. రియాద్‌లోని ఓ గిడ్డంగిలో ఐరన్ మెషీన్ల షిప్‌మెంట్‌లో 1.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ ట్యాబ్లెట్‌లు దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. స్మగ్లింగ్ లేదా కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే కాన్ఫిడెన్షియల్ హాట్‌లైన్ 1910, అంతర్జాతీయ నంబర్ 00 966 114208417 లేదా ఇమెయిల్ [email protected]కు సమాచారం అందజేయాలని సౌదీ అధికారులు కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, విలువైన సమాచారం అందించిన వారికి ఆర్థిక రివార్డులు అందిస్తామని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!







