ఫిఫా ప్రపంచ కప్ 2022: మెడిసిన్స్‌పై ప్రయాణికులకు ఎంబసీ కీలక సూచనలు
- November 07, 2022
దోహా: ఫిఫా ప్రపంచ కప్ 2022 నిమిత్తం ఖతార్‌కు వచ్చే ప్రయాణికులు తమ వెంట తెచ్చుకునే మెడిసిన్స్ విషయంలో ఇండియన్ ఎంబసీ పలు కీలక సూచనలు చేసింది. ఖతార్ వచ్చే ప్రయాణికులందరూ మెడిసిన్స్ తెచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖతార్ వచ్చేటప్పుడు మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలు ఉన్న మందులను తీసుకురావడంపై నిషేధం ఉందన్నారు. లిరికా, మాడోల్, అల్ప్రజోలం (క్సానాక్స్), డయాజెపామ్ (వాలియం), జోలం, క్లోనాజెపం, జోల్పిడెమ్, కోడైన్, మెథడోన్, ప్రీగాబాలిన్ వంటి మెడిసిన్లను ఖతార్ నిషేధించిందని పేర్కొంది. నిషేధిత మందులను తసుకువచ్చిన సందర్భంలో అరెస్ట్ చేయడంతోపాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని ఎంబసీ హెచ్చరించింది. ముఖ్యంగా స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం మెడిసిన్స్ తేవద్దని సూచించింది. ఒకవేళ నిషేధం లేని, వ్యక్తిగతానికి ఉద్దేశించిన మెడిసిన్స్ విషయంలో 30 రోజుల క్రితం గుర్తింపు పొందిన డాక్టర్ లేదా ఆసుపత్రి జారీ చేసిన ప్రిస్క్రిప్షన్ ఉంటే అలాంటి మెడిసిన్స్ ను అనుమతిస్తారు. మరింత సమాచారం కోసం వెబ్ సైట్ (https://indianembassyqatar.gov.in) లేదా ఇండియన్ ఎంబసీ హెల్ప్ డెస్క్ (+974 4012 4809), ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ (+974 3993 1874, +974 3993 6759, +974 3993 4308, +974 5564 7502, +974 5566 7569) నంబర్లలో లేదా ఇ-మెయిల్ ([email protected]) ద్వారా సంప్రదించాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!









